బెంగళూరులో వంట మనుషుల ఖర్చులపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ

రిపోర్టర్: రాము స్థలం: Bengaluru

బెంగళూరులో నివసించే మేఘ అనే సోషల్ మీడియా వినియోగదారు వంట మనుషుల ఖర్చులపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇద్దరు సభ్యులున్న కుటుంబానికి వంట మనిషికి నెలకు ఏడు నుండి ఎనిమిది వేల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోందని ఆమె పేర్కొన్నారు. రుచికరమైన ఆహారం కోసం కాకుండా రోజువారీ వంట టెన్షన్ తప్పుతుందనే ఉద్దేశంతోనే ఈ మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.