బోగారంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సులో ప్రయాణికులంతా సురక్షితం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రామన్నపేట
రామన్నపేట మండలం బోగారంలో యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. రామన్నపేటకు వెళ్తుండగా రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి బస్సు దూసుకెళ్లింది. ముందు వెళ్తున్న వాహనం నుంచి పేడ కింద పడడంతో డ్రైవర్ బ్రేకులు వేశారు. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై ఎనిమిది మంది ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.