స్వదేశీ పరిజ్ఞానంతో 3డీ ప్రింటెడ్ జెట్ ఇంజిన్ తయారీ.
రిపోర్టర్: కృష్ణ
స్థలం: బీహార్
బిహార్‌కు చెందిన యువ ఇంజినీర్ సుబ్రత్ శాండిల్య తక్కువ ఖర్చుతో కూడిన స్వదేశీ 3డీ-ప్రింటెడ్ జెట్ ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. శాండిల్య ఏరోస్పేస్ స్టార్టప్ ద్వారా 2 కిలోన్యూటన్ థ్రస్ట్ సామర్థ్యం గల ఈ కాంపాక్ట్ ఇంజిన్‌ను డిజైన్ చేస్తున్నారు. రక్షణ రంగంలో దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చే లక్ష్యంతో క్షిపణులు, యూఏవీల కోసం దీనిని తయారు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు బిహార్ ప్రభుత్వం సీడ్ ఫండింగ్ ద్వారా మద్దతు అందించింది.