దానం నాగేందర్‌కు ఉపఎన్నికల సెంటిమెంట్ కలిసిరాదని ఎంపీ రఘునందన్‌రావు జోస్యం

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్‌పై నమోదైన అనర్హత పిటిషన్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. గత అనుభవాలను విశ్లేషిస్తూ దానం నాగేందర్‌కు ఉపఎన్నికల సెంటిమెంట్ అస్సలు కలిసిరాదని, మరోసారి బరిలోకి దిగితే ఓటమి తప్పదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో బీజేపీ బలం పెరుగుతోందని, ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయితే కమలం జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. మరోవైపు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.