అతి శబ్దంతో డీజేల మోత గుండెకు ప్రమాదకరమన్న డాక్టర్ శివప్రసాద్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: హైదరాబాద్

హైదరాబాద్: అధిక శబ్దంతో డీజేలు నిర్వహించడం ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలంగాణ హోమియోపతిక్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివ ప్రసాద్ హెచ్చరించారు. అతి పెద్ద శబ్దాలకు ఎక్కువసేపు గురికావడం వల్ల శరీరంలో ఒత్తిడి ప్రతిస్పందన పెరిగి హృదయ స్పందన, రక్తపోటులో తాత్కాలిక మార్పులు రావచ్చని తెలిపారు. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.