టెక్ ప్రియులకు గుడ్ న్యూస్: రెండు కొత్త ల్యాప్టాప్లను విడుదల చేసిన హెచ్పీ
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ టెక్ బ్రాండ్ హెచ్పీ భారతీయ మార్కెట్లోకి రెండు నూతన ఓఎల్ఈడీ ల్యాప్టాప్లను విడుదల చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. హెచ్పీ ఓమ్నిబుక్ 5 14 మరియు ప్రోబుక్ 4 G2iS 14 పేర్లతో వీటిని లాంచ్ చేసినట్లు తెలిపాయి. ఓఎల్ఈడీ డిస్ప్లేలు, శక్తివంతమైన ప్రాసెసర్లు, తక్కువ బరువు వంటి ప్రత్యేక ఫీచర్లతో ఈ డివైజ్లు అందుబాటులోకి వచ్చాయని, టెక్ ప్రియులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటాయని కంపెనీ పేర్కొంది.