పురాతన మానవుల డీఎన్ఏ పరిశోధన: యూరప్ ప్రజల మధ్య జన్యుపరమైన సంబంధాలు బట్టబయలు

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

ముప్ పై వేల సంవత్సరాల క్రితమే తూర్పు మరియు పశ్చిమ యూరప్ ప్రజలు జన్యుపరంగా కలుసుకున్నారని పరిశోధకులు తేల్చిచెప్పారు. వియన్నా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త పెరె గెలబెర్ట్ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఫ్రాన్స్ గుహలో దొరికిన పురాతన మహిళ అస్థిపంజరం డీఎన్ఏ ద్వారా ఈ అద్భుతమైన నిజం వెలుగులోకి వచ్చిందని సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్ లో ప్రచురితమైన పరిశోధన వెల్లడించింది.