మల్లన్నసాగర్ నిర్వాసితుల ఆగ్రహం: పునరావాస కాలనీ లేఅవుట్లు క్రమబద్ధీకరించాలని కలెక్టర్ కు వినతి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: సిద్దిపేట

మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస కాలనీల్ లోని లేఅవుట్లను ఆమోదిత లేఅవుట్లుగా గుర్తించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారని మల్లన్నసాగర్ నిర్వాసితుల సంఘం ప్రతినిధులు తెలిపారు. పురపాలక శాఖ జారీ చేసిన మెమో భూసేకరణ చట్టానికి విరుద్ధంగా ఉందని పేర్కొంటూ మంగళవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కు అభ్యంతర దరఖాస్తు సమర్పించారు. గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల ఉపాధి హామీ కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ సమస్యలను పరిష్కరించాలని కోరారు.