రాజధాని అమరావతి అంశంపై వ్యాజ్యాలు నిరర్థకమంటూ హైకోర్టు స్పష్టీకరణ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో మూడు రాజధానుల ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు నిరర్థకమయ్యాయని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. నిరర్థకమైన వ్యాజ్యాలు ఇంకేమైనా పెండింగ్లో ఉంటే కోర్టు దృష్టికి తీసుకురావాలని న్యాయవాదులకు సూచించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది.