విజయనగరం ఆసుపత్రిలో నూతన లిఫ్ట్: రూ.58.50 లక్షల ఎంపీ నిధులతో ప్రారంభం
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయనగరం
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని ఎంసీహెచ్ ఆసుపత్రిలో రూ.58.50 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో నిర్మించిన నూతన లిఫ్ట్‌ను సోమవారం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఘనంగా ప్రారంభించారు. రోగులు, గర్భిణులు, ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ లిఫ్ట్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ లిఫ్ట్ నిర్మాణం కోసం గతంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు నిధులు కేటాయించాలని ఎంపీని కోరడం జరిగింది.