రుద్రంపూర్లో ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ టోర్నమెంట్ పోటీలు

రిపోర్టర్: శివ స్థలం: రుద్రంపూర్

రుద్రంపూర్లోని సీఈఆర్ క్లబ్లో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ టోర్నమెంట్ పోటీలు శనివారం ఘనంగా ముగిశాయని కొత్తగూడెం ఏరియా ఎస్ఓటు జీఎం ఎం. గోవిందరావు తెలిపారు. రెండు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన ఈ క్రీడా సంబరాల ముగింపు వేడుకల్లో విజేతలకు అతిథులు ట్రోఫీలు, ప్రశంసల పత్రాలు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు, అధికారులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సందడి చేశారు.