ఆంధ్రప్రదేశ్లో భారీగా పడిపోయిన సంతానోత్పత్తి రేటుపై ఈఏసీ పీఎం అధ్యయనం
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో 69.5 శాతం మంది మహిళలు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకోవడంతో సంతానోత్పత్తి రేటు 1.4కి పడిపోయిందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యయనంలో వెల్లడైంది. జనాభా స్థిరీకరణకు 2.1 అవసరం కాగా ఏపీలో తక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో జనాభా పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి కుని ప్రోత్సాహకాలకు కోత విధించిందని ఈఏసీ పీఎం పేర్కొంది.