అనకాపల్లి జిల్లాలో బావిలో దూకి ప్రేమికుల జంట ఆత్మహత్య

రిపోర్టర్: సురేష్ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలంలో గురువారం బావిలో దూకి ప్రేమికుల జంట బలవన్మరణానికి పాల్పడింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఇద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయి, కె.కోటపాడు మండలం పైడమ్మ చెరువు సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.