సంతానలేమి సమస్యకు చెక్: IUI మరియు IVF వైద్య విధానాల మధ్య తేడాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: గుంటూరు

సంతానలేమి సమస్యలను పరిష్కరించడంలో IUI మరియు IVF వైద్య ప్రక్రియలు కీలకమని గుంటూరు నోవా ఐవిఎఫ్ ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ పి.వి. నిఖిత తెలిపారు. ఆలస్య వివాహాలు, చెడు జీవనశైలి కారణంగా వంధ్యత్వ రేటు గణనీయంగా పెరిగిందని ఆమె పేర్కొన్నారు. IUI పద్ధతిలో శుక్రకణాలను గర్భాశయంలోకి పంపిస్తారని, IVF విధానంలో ల్యాబొరేటరీలో పిండం తయారుచేసి గర్భాశయంలోకి ప్రవేశపెడతారని దంపతులు తెలుసుకోవాలని సూచించారు.