ఉపాధి హామీ ఉద్యోగులకు తీపి కబురు: గ్రాట్యుటీ మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలోని ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఎఫ్టీఈ ఉద్యోగులకు విజయదశమి వేళ రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్ అందించింది. మొత్తం మూడు వేల ఎనిమిది వందల మంది ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు చేస్తూ ఇవాళ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రిటైర్మెంట్ సమయంలో ప్రతి ఉద్యోగికి కనీసం నాలుగు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు ఆర్థిక లబ్ధి చేకూరనుందని వారు వెల్లడించారు.