డిసెంబర్ నాటికి టిడ్కో ఇళ్లు అందజేస్తామన్న ఈఈ శ్రీరామ్మూర్తి
రిపోర్టర్: వెంకట్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో నిలిచిపోయిన టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేస్తోంది. గడిచిన ఆరేళ్లుగా ఆగిపోయిన బొబ్బిలి, రాజాం, నెల్లిమర్లతో పాటు సారిపల్లి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులను అధికారులు వేగవంతం చేశారు. గుత్తేదారులకు రావాల్సిన బకాయిలను చెల్లించడంతో పనులు ఊపొందాయి. డిసెంబర్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందించేలా చర్యలు చేపట్టినట్లు ఉమ్మడి టిడ్కో ఈఈ శ్రీరామ్మూర్తి స్పష్టం చేశారు.