భారీ వర్షాల వేళ ప్రజల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్
రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లాలో అల్పపీడనం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరేట్లో 24×7 జిల్లా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో 9849903879 హెల్ప్ లైన్ నెంబర్లో సంప్రదించాలన్నారు. వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ ప్రజలను కోరారు.