కొచ్చి ఘోర రోడ్డు ప్రమాదం: అదనపు జిల్లా జడ్జికి మధ్యంతర రక్షణ

రిపోర్టర్: సురేష్ స్థలం: Kochi

కొచ్చిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మైనర్ కుమారుడు కారు నడిపి వ్యక్తి మృతికి కారణమైన కేసులో అదనపు జిల్లా జడ్జికి కేరళ హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయనను అరెస్టు చేయవద్దని జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ స్పష్టం చేసినట్లు న్యాయవాదులు తెలిపారు. కారు ప్రమాద ఘటనపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.