దేశంలో పారదర్శకత వైపు యూపీఎస్సీ ప్రయాణం

రిపోర్టర్: అశోక్ స్థలం: New Delhi

యూపీఎస్సీ ప్రయాణించిన వందేళ్ల కాలంలో దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని పీఐబీ ఇండియా వెల్లడించింది. ఒకప్పుడు పరీక్ష రాయడానికి సముద్రాలు దాటాల్సిన పరిస్థితి ఉండేదని, నేడు డిజిటల్ రిక్రూట్మెంట్ విధానం ద్వారా లక్షలాది దరఖాస్తులు సులువుగా పరిష్కారమవుతున్నాయని పేర్కొంది. 1926 నుంచి ప్రారంభమైన ఈ వ్యవస్థ దేశ ప్రజలకు సేవలను మరింత చేరువ చేస్తూ, పారదర్శకతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని, ఆధునిక సాంకేతికతను జోడించి యువతకు సులభతరమైన అవకాశాలను కల్పిస్తోందని వివరించింది.