జాతీయ స్థాయిలో సత్తా చాటిన గిరిజన యువతి ప్రీతి ముండే
రిపోర్టర్: సతీష్
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన గిరిజన యువతి ప్రీతి ముండే జాతీయ స్థాయిలో అద్భుత విజయం సాధించారు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ‘మిస్ డివైన్ బ్యూటీ 2026’ గ్రాండ్ ఫినాలేలో ఆమె ‘మిస్ ఇండియా ఎర్త్ వాటర్ 2026’ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించిన ప్రీతి ముండే ఈ ప్రతిష్టాత్మక విజయం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.