చెన్నరాజుపాడులో ఓట్ల వేటలో దూసుకెళ్లిన వైయస్సార్సీపీ శ్రేణులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఓబులవారిపల్లి
ఓబులవారిపల్లి మండలం చెన్నరాజుపాడులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోరుతూ రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ సుంకేసుల రఫీ గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైయస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఆయన ఓటర్లను కోరారు. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ నాయకులు ముమ్మరంగా ఓట్లు అభ్యర్థించారు.