ఏపీలో భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశం

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను అప్రమత్తం చేశారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, ప్రజలకు మొబైల్ అలర్ట్స్ పంపాలని ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచారు.