ది ప్యారడైజ్ చిత్రానికి తెలంగాణలో టికెట్ ధరల పెంపునకు అనుమతి
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 24న విడుదల కానున్న నేపథ్యంలో, తొలి పది రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకోవడంతో పాటు రోజుకు ఐదు షోలకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అలాగే సెప్టెంబర్ 23న సాయంత్రం 6.30 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షో ప్రదర్శనకు కూడా అనుమతి లభించింది.