జాతీయ సబ్జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు బెల్లంపల్లి విద్యార్థి ఎంపిక
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సీఓఈ విద్యార్థి గజ్జల సుశాంత్ జాతీయ స్థాయి సబ్జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన అతను ఈ నెల 25 నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగే పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు.