వైద్యుల విమర్శలపై దీపిందర్ గోయల్ స్పందన: టెంపుల్ డివైజ్ పై క్లారిటీ
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
టెంపుల్ హెల్త్ టెక్ డివైజ్ శాస్త్రీయతపై వైద్యులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను జొమాటో వ్యవస్థాపకులు దీపిందర్ గోయల్ తీవ్రంగా ఖండించారు. తన సరికొత్త ఉత్పత్తులపై వస్తున్న విమర్శలకు సోషల్ మీడియా వేదికగా ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తమ ప్రాజెక్ట్ మోసం కాదని, సైన్స్‌ను సరైన మార్గంలో ముందుకు తీసుకెళ్లేందుకే సొంతంగా కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టామని స్పష్టం చేశారు. తాము ప్రవేశపెట్టిన పరికరంలో ఎలాంటి తప్పు లేదని, వినియోగదారులకు నచ్చకపోతే రిటర్న్ చేసే వెసులుబాటు కూడా కల్పించామని దీపిందర్ గోయల్ తెలిపారు.