రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెక్స్ట్ జెన్ ప్రాజెక్టు అమలు
రిపోర్టర్: నరేష్
స్థలం: రాజమహేంద్రవరం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ జెన్ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఓపీ సమయంలో రోగికి ప్రత్యేక ఐడీ కేటాయించి, వైద్య చరిత్రను డిజిటల్ డేటాలో భద్రపరుస్తున్నట్లు రాజమహేంద్రవరం జీజీహెచ్ సూపరింటెండెంట్ సోఫియా పాలేటి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎక్కడికైనా రిపోర్టులు తీసుకెళ్లే అవస్థలు తప్పుతాయని, ఒక్క క్లిక్‌తో రోగి పూర్వ వైద్య సమాచారం తెలుసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.