రోలుగుంటలో ఎంఆర్పీఎస్ నూతన కమిటీల నియామకం
రిపోర్టర్: G TAMMUNAIDU
స్థలం: రోలుగుంట
రోలుగుంట మండలంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు మండల స్థాయి నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఇన్చార్జి వెంకట్రావు, నియోజకవర్గ ఇన్చార్జి ఎలుసూరి ఘాటీలు, మోర్త శీనువాసు సమక్షంలో ఈ నియామకాలు జరిగాయి.
నూతన అధ్యక్షులుగా పులగుజ్జుల రాజు (ఎంఆర్పీఎస్), పులగుజ్జుల నర్సింగరావు (ఎంఈఎఫ్), కొడి అప్పారావు (ఎంఎస్పీ), ఎత్తుల చిన అప్పారావు (వీహెచ్పీఎస్), ఎత్తుల వరలక్ష్మి (ఎంఎంఎస్)లను నియమించారు. సంఘం బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.