భూదాన్ పోచంపల్లి మోడల్ స్కూల్ వద్ద డంపింగ్ యార్డు బీభత్సం: విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆవేదన

రిపోర్టర్: అశోక్ స్థలం: భూదాన్ పోచంపల్లి

భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ స్కూల్ పక్కనే ఉన్న డంపింగ్ యార్డు కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారని స్థానికులు తెలిపారు. చెత్తకుప్పలకు నిత్యం నిప్పు పెడుతుండటంతో వెలువడుతున్న విషవాయువులు, దుర్వాసన వల్ల ఊపిరాడక, వాంతులు, జ్వరాలతో విద్యార్థినులు అల్లాడిపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.