నటనకు స్వస్తి పలకాలని అనుకున్నా: సమంత కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: India
ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకుల వల్ల ఒకానొక సమయంలో నటనకు పూర్తిగా స్వస్తి పలకాలని అనుకున్నట్లు అగ్ర కథానాయిక సమంత రూత్‌ప్రభు తెలిపారు. వైద్యుల సలహా మేరకు వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. నెగెటివ్ కామెంట్లను పట్టించుకోవడం మానేశానని, తనను మార్చాలనుకునే వారి కోసం సమయం వృథా చేసుకోనని ఆమె స్పష్టం చేశారు.