కాంగ్రెస్ నాయకుల జేబులు నింపుకోవడానికే రిజర్వాయర్ల పెంపు: డీకే అరుణ ధ్వజం

రిపోర్టర్: రాము స్థలం: జోగులాంబ గద్వాల

రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు పేరుతో కాంగ్రెస్ నాయకులు తమ జేబులు నింపుకోవడానికే చూస్తున్నారని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలో నిర్వహించిన భాజపా కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ కార్యకర్తలకే కేటాయిస్తూ ప్రజాపాలనకు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. మున్సిపాలిటీల్లో కోట్ల రూపాయల పన్నులు వసూలు చేసి కేవలం లక్షల రూపాయలు మాత్రమే లెక్కలు చూపుతున్నారని ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.