తిరుపతిలో వైద్య విద్యార్థి అరెస్ట్: పెళ్లి పేరుతో వేధింపులు

రిపోర్టర్: రాము స్థలం: Tirupati

పెళ్లి పేరుతో యువతిని మోసం చేసి, బలవంతంగా మతం మార్చాలని చూస్తూ ప్రైవేట్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసిన హైదరాబాద్కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి రయీద్ను తిరుపతి అలిపిరి పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తెలిపారు. జార్జియాలో చదువుతున్న సమయంలో పరిచయమైన యువతిని తిరుపతిలోని హోటల్కు రప్పించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.