కశ్మీర్ అంశంపై తుర్కియే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: New Delhi

ఐక్యరాజ్యసమితి వేదికగా జమ్మూకశ్మీర్ అంశం ప్రస్తావించిన తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇది పూర్తిగా దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంతర్గత విషయమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. బాహ్య శక్తులు జోక్యం చేసుకునే హక్కు లేదని తేల్చిచెప్పారు. దౌత్యపరమైన చర్చలు జరగాలంటే ముందుగా పాకిస్థాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించాలని భారత్ గట్టిగా నొక్కి చెప్పింది.