ఒంటి కాలుతోనే బడికి వెళ్తున్న చిన్నారి రాగిణికి సాయం
రిపోర్టర్: మహేష్
స్థలం: బల్లియా, ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్ బల్లియాకు చెందిన ఏడేళ్ల రాగిణి, ప్రమాదంలో కాలు కోల్పోయినా మొక్కవోని ధైర్యంతో పాఠశాలకు వెళ్తోంది. 400 మీటర్ల దూరం ఒంటి కాలుతోనే గెంతుతూ వెళ్తున్న ఈ చిన్నారి, తనకు సైకిల్ ఇప్పించమని జిల్లా కలెక్టర్‌ను కోరిన వీడియో వైరల్ అయ్యింది. చదువుపై రాగిణికి ఉన్న అంకితభావం చూసి నెటిజన్లు స్పందించగా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సహా పలువురు ఆమెకు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.