ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఈఎన్‌టీ శస్త్రచికిత్స విజయం

రిపోర్టర్: కిరణ్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

కడప జిల్లాకు చెందిన 18 ఏళ్ల నారబోయిన మేఘనకు ఇల్లెందు ప్రభుత్వాసుపత్రిలో ఈఎన్‌టీ వైద్యురాలు డాక్టర్ రవి తేజస్వి ఖరీదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. గత మూడేళ్లుగా ముక్కు సమస్యతో బాధపడుతున్న మేఘనకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్ష వరకు ఖర్చవుతుందని తెలపడంతో, మేనమామ డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్ రవిబాబు సూచన మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఈ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులకు మేఘన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.