రాప్తాడు విద్యార్థినిపై ఉన్మాది దాడి: మణిపాల్ ఆసుపత్రిలో బాలికను పరామర్శించిన నారా లోకేశ్

రిపోర్టర్: సురేష్ స్థలం: Anantapur

రాప్తాడులో ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థినిని బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమెను తన సొంత కూతురిలా కాపాడే బాధ్యత తీసుకుంటానని ఆయన వెల్లడించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పిల్లల రక్షణ కోసం బలమైన వ్యవస్థను తీసుకొస్తామని నారా లోకేశ్ స్పష్టం చేశారు.