పాలమూరు రైతుల గోడు వినాలంటూ రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం

రిపోర్టర్: నరేష్ స్థలం: Wanaparthy

పాలమూరు బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా పాలమూరు రైతుల గోడు వినాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో పర్యటించిన ఆయన, రైతులు పడుతున్న కష్టాలను, వారి కన్నీళ్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు తీవ్రంగా మోసపోతున్నారని, ప్రభుత్వ వైఫల్యాల వల్లనే రైతుల గోస కట్టలు తెంచుకుంటోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.