బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమని పిలుపునిచ్చిన దండి సురేష్

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం

ఖమ్మం వన్టౌన్ లో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో నగర మహాసభ పీట్ల కృష్ణమూర్తి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ, దేశ సంపదను సృష్టిస్తున్న బీసీలకు అన్ని రంగాల్లో తగిన వాటా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కులాలు, ఉపకులాలుగా విడిపోకుండా ఐక్యంగా హక్కుల కోసం పోరాడాలని, రాబోయే ఎన్నికల్లో రాజ్యాధికారం సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.