రాపల్లి గ్రామంలో ఘనంగా దేవీ నవరాత్రుల మహా అన్నదానం
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాపల్లి గ్రామంలో దేవీ నవరాత్రుల ముగింపు సందర్భంగా మహా అన్నదానం నిర్వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు గాంధీతో పాటు గంగవరపు ప్రసాద్, ఏనుగు జనార్ధన్, తోట చలపతి, చల్లా బాబు, చావా కృష్ణయ్య, ఏనుగు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది.