ఇచ్ఛాపురం పోరులో విరుచుకుపడి ప్రత్యర్థులను చిత్తుచేసిన టీడీపీ అభ్యర్థి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఇచ్ఛాపురం

ఇచ్ఛాపురం పురపాలక సంఘం పన్నెండో వార్డు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందికి జాని ఘన విజయం సాధించారు. మొత్తం పోలైన ఏడు వందల ఓట్లలో టీడీపీ అభ్యర్థికి ఐదు వందల ఆరు ఓట్లు దక్కాయి. ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థికి కేవలం నూట యాభై రెండు ఓట్లు మాత్రమే లభించడంతో భారీ మెజారిటీ నమోదు అయింది.