కుషాయిగూడలో బాటసారులపైకి దూసుకెళ్లిన కారు తొమ్మిది మందికి గాయాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బాటసారుల పైకి దూసుకెళ్లిన ఘటనలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. కమలానగర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాదం అనంతరం కారు ఆపకుండా పరారైన డ్రైవర్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.