ఢిల్లీ రాంలీలా మైదానంలో కదంతొక్కిన అచ్చంపేట కాంగ్రెస్ శ్రేణులు
రిపోర్టర్: dumarla bhaskar senier journalist
స్థలం: అచ్చంపేట
ఏఐసీసీ పిలుపుమేరకు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అచ్చంపేట కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించాయి. ఓట్ చోర్ దేశ్ బచావో కార్యక్రమంలో భాగంగా బీజేపీ అప్రజాస్వామిక విధానాలపై ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు నినాదాలు చేశారు. ఓటు హక్కును కాలరాసే కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు.