జర్నలిస్టుల ఇండ్ల స్థలాల జాప్యంపై ఇందిరాపార్ కు వద్ద ధర్నా

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడం తగదని పలువురు జేఎన్జే సొసైటీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని ఇందిరాపార్ కు వద్ద మంగళవారం జర్నలిస్టులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయుడు ఎంవీఆర్ శాస్త్రి మాట్లాడుతూ, పద్దెనిమిదేళ్లుగా ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నామని వాపోయారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రత్యేక జీవో ద్వారా తక్షణమే ఇండ్ల స్థలాలు కేటాయించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.