షాకింగ్ ఘటన: ప్రయాణికురాలి దాడిలో మణుగూరు డిపో కండక్టర్ ప్రవళిక మృతి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
ప్రయాణికురాలి దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళిక మృతి చెందడం పట్ల టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన ఆర్టీసీకి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిందితురాలపై హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి సంస్థ తరఫున పూర్తి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.