రష్యన్ ఆయిల్ కొనుగోళ్లపై అమెరికా సుంకాల ప్రతిపాదనలను పరిశీలిస్తున్నాం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: న్యూఢిల్లీ

రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై అమెరికా ప్రతిపాదించిన సుంకాల అంశంపై వివరాలు సేకరిస్తున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు అమెరికా ప్రతినిధుల సభ ఈ చట్టాన్ని ఆమోదించింది. రష్యా ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడానికి చైనా, భారతదేశం ఇతర దేశాలపై వంద శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని ఈ బిల్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కల్పిస్తోందని రాయిటర్స్ పేర్కొంది. భారత్ తన వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.