సీఈవో జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలంటూ అభిజీత్ డిప్కే డిమాండ్

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజీత్ డిప్కే డిమాండ్ చేశారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ పేరుతో దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల ఓట్లను తొలగించారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యవహారంపై రాబోయే నూతన పరిణామాల నేపథ్యంలో 48 గంటల్లోగా స్పందించకుంటే దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.