ఉప్పల మల్సూర్ కుటుంబానికి రెండు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Telangana

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన దివంగత ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ కుటుంబానికి ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇంటి భరోసా లభించింది. ఆయన కోడళ్లు ఉప్పల పుష్పలత, ఉప్పల యశోద గార్లకు రెండు ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రజాకార్ల నిరంకుశత్వాన్ని ఎదిరించి, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల కోసం నిలిచిన మల్సూర్ కుటుంబాన్ని ఆదుకోవడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి పేదల పక్షపాతి అని నిరూపించుకున్నారు.