గ్లోబల్ చెస్ లీగ్ వెనుక ఆసక్తికర నిజం బయటపెట్టిన ఆనంద్ మహీంద్రా

రిపోర్టర్: రమేష్ స్థలం: కర్ణాటక

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్ ఏర్పాటు వెనక ఉన్న ఆసక్తికర కథనాన్ని వెల్లడించారు. 2020లో కమెడియన్ సమయ్ రైనా విసిరిన సరదా సవాల్ వల్లే ఈ అంతర్జాతీయ టోర్నమెంట్ ప్రారంభమైందని తెలిపారు. దీన్ని తనపై జరిగిన అత్యంత ఖరీదైన జోక్‌గా అభివర్ణించిన ఆయన, FIDE అధ్యక్షుడు ఆర్కాడీ ద్వోర్కోవిచ్, విశ్వనాథన్ ఆనంద్ సహకారంతో ఇది ప్రపంచ స్థాయి పోటీగా అరంగేట్రం చేసిందని పేర్కొన్నారు.