అమెరికా వీసా బులెటిన్ విడుదల: ఈ కేటగిరీల వారికి భారీ ఊరట
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
అమెరికాలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని చూస్తున్న భారతీయుల కోసం అక్టోబర్ 2026కు సంబంధించిన తాజా వీసా బులెటిన్‌ను విడుదల చేసినట్లు నిపుణులు తెలిపారు. కొత్త ఫిస్కల్ ఇయర్ ప్రారంభం కావడంతో ఈ బులెటిన్‌లో ఈబీ-వన్, ఈబీ-ఫోర్ కేటగిరీల్లోని దరఖాస్తుదారులకు మంచి కదలిక లభించిందని వారు పేర్కొన్నారు. అయితే అత్యధికులు ఎదురుచూస్తున్న ఈబీ-టూ, ఈబీ-త్రీ వర్గాలకు మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోందని వెల్లడించారు.