రేషన్ కార్డులో పేరు నమోదు చేయాలంటూ రాముడు వేడుకోలు
రిపోర్టర్: KISHORE M
స్థలం: ఆదోని
కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామానికి చెందిన బి. రాముడు తన రేషన్ కార్డులో పేరు నమోదు కాలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రేషన్ కార్డులో పేరు చేర్చి, ప్రభుత్వ పరంగా అందే సంక్షేమ ఫలాలను కల్పించాలని ఆయన సంబంధిత అధికారులను వేడుకున్నారు. చేతులు జోడించి తన సమస్యను తక్షణమే పరిష్కరించి ఆదుకోవాలని కోరారు.