జాంబీ రెడ్డి టూ చిత్రంలో విలక్షణ నటుడు ఉపేంద్ర ఫస్ట్ లుక్ విడుదల

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

విలక్షణ నటుడు ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా జాంబీ రెడ్డి సీక్వెల్ చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. తేజ సజ్జ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. భారీ చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ చేతిలో ఆయుధంతో ఉన్న ఉపేంద్ర లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.